దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెల్లో.. పట్టణాల్లో ఉల్లాసంగా.. ఉత్సాహం సంబరాలు జరుపుకుంటున్నారు. కొత్త బట్టలతో.. రకరకాలైన పిండి వంటలతో పల్లెలన్నీ సందడి.. సందడిగా ఉన్నాయి. అంతేకాకుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో జోరు సాగుతోంది.
ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రధాని మోడీ దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు మాతృభాషలోనే మోడీ ట్వీట్ చేశారు. ఈ పండుగ అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపే పండుగ ఇదేనన్నారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖ శాంతులను.. ఆరోగ్యాన్ని ప్రసాదించాలని. మీ కలలన్నీ సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/VZtghYmQQS
— Narendra Modi (@narendramodi) January 15, 2026
