Site icon NTV Telugu

Melodi: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పోస్ట్..

Melodi Post

Melodi Post

Melodi: యూఏఈ దుబాయ్ వేదికగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు( COP28)ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. జార్జియా మెలోని, ప్రధాని మోడీతో దిగిన సెల్ఫీని ‘మెలోడీ’ హాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీన ఈ పోస్టుని రీట్వీట్ చేస్తూ..‘‘ స్నేహితులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’’ అని రాశారు.

Read Also: Israel: ఇజ్రాయెల్లో దారుణ ఘటన.. గర్భిణీని కత్తితో పొడిచి చంపిన దుండుగుడు

ప్రస్తుతం జార్జియా మెలోని పోస్ట్ వైరల్ గా మారింది. #Melodi కేవలం కొన్ని నిమిషాల్లోనే టాప్ ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే ఈ పోస్ట్‌కి 24 మిలియన్ల కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. శుక్రవారం దుబాయ్‌లో జరిగిన COP28 సదస్సులో భాగంగా ఇటలీ ప్రధాని ఈ సెల్ఫీని తీశారు.

ఈ ఏడాది భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్ నుంచి ‘మెలోడి’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇద్దరు ప్రధానుల మధ్య ఫ్రెండ్షిప్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు ప్రధానులు కూడా పలు విషయాల గురించి చర్చించారు. పలు విషయాలపై చర్చించిన ప్రధానులు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీనిపై నెటిజన్లు తెగస్పందిస్తున్నారు.

Exit mobile version