Site icon NTV Telugu

PM Narendra Modi: స్వామి వివేకానందను గుర్తు చేసుకున్న మోదీ.. సెప్టెంబర్ 11తో ప్రత్యేక అనుబంధం

Swami Vivekananda

Swami Vivekananda

Swami Vivekananda chicago speech: ప్రధాని నరేంద్ర మోదీ, స్వామి వివేకనందను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 11, 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ లో భారత దేశ విలువను ప్రపంచానికి పరిచయం చేశారు స్వామి వివేకానంద. సెప్టెంబర్ 11తో స్వామి వివేకనందకు ప్రత్యేక అనుబంధం ఉంది. 1893లో ఇదే రోజున, ఆయన చేసిన ప్రసంగం అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటిగా నిలిచిందని.. స్వామిజీ ప్రసంగం భారతదేశ సంస్కృతి, నైతికత గురించి ప్రపంచానికి పరిచయం చేసిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Read Also: Krishnam Raju: కృష్ణం రాజు మరణంపై ప్రధాని మోదీ, అమిత్ షా సంతాపం

స్వామి వివేకానంద ప్రపంచ మతాల పార్లమెంట్ లో చేసిన ప్రసంగం హిందూమతం, భారతదేశం గురించి ప్రపంచంలోని అన్ని దేశాలకు తెలిసేలా చేసింది. ‘‘ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’’ అంటూ మొదలైన ఆయన ప్రసంగానికి అక్కడ ఉన్నవాళ్లంతా ముగ్ధులయ్యారు. మీరు అందించిన సాదర స్వాగతం నాకు ఎంతో ఆనందం నింపిందని స్వామి వివేకనంద ప్రసంగంలో అన్నారు. లక్షాలది హిందూ ప్రజల పేరిటన నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ.. ప్రపంచానికి సహనం, సార్వత్రిక ఆమోదం రెండింటిని బోధించిన హిందూ మతానికి చెందినందుకు గర్వపడుతున్నానని స్వామి వివేకనంద ప్రసంగంలో అన్నారు. మేము అన్ని మతాలను నిజమైనవిగా అంగీకరిస్తామని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. రోమన్ల దౌర్జన్యంతో భారతదేశానికి వచ్చిన ఇజ్రాయిలీయులను అక్కున చేర్చుకున్నామని ఆయన ప్రసంగంలో అన్నారు. తన చికాగో ప్రసంగంలో స్వామి వివేకనంద గీతా సారం గురించి వివరించారు. హిందూ మతంపై చేసిన ఆయన అద్భుత ప్రసంగం ప్రపంచ ఖ్యాతి పొందింది.

 

 

Exit mobile version