NTV Telugu Site icon

PM Modi-Putin telephonic call: పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఉక్రెయిన్ పర్యటనపై చర్చ..

Pm Modi Putin

Pm Modi Putin

PM Modi-Putin telephonic call: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల జరిగిన ఉక్రెయిన్ పర్యటనపై ఇరు నేతలు చర్చించారు. ‘‘ ఈరోజు అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ప్రత్యేక మరియు విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడానికి చర్యల గురించి చర్చించాము. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఇటీవలి ఉక్రెయిన్ పర్యటన గురించి మాట్లాడాను. ఈ సంఘర్షణపై స్థిరమైన మరియు శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం యొక్క దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించాను.” అని ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Read Also: MLA Raja Singh: అసదుద్దీన్ ఇల్లు కూడా ప్రభుత్వ స్థలం లో కట్టుకున్నాడు

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ పోలాండ్‌తో పాటు ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్‌స్కీతో చర్చించారు. సంఘర్షణను దౌత్యం, చర్యల ద్వారా పరిష్కరించుకోవాలని మరోసారి మోడీ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు జోబైబెన్‌తో కూడా మోడీ టెలిఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్ పర్యటన విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.

Show comments