NTV Telugu Site icon

Atal Bihari Vajpayee: వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులు..

Pm Modi

Pm Modi

Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పలువురు నివాళులు అర్పించారు. ఆయన స్మారక చిహ్నం ‘ సదైవ్ అటల్’ వద్దకు చేరుకున్న బీజేపీ నేతలు ఘనంగా నివాళి అర్పించారు. ప్రధానితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలు నివాళులు అర్పించారు.

Read Also: Delhi Airport: ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం..

వాజ్‌పేయి జీవితాంతం దేశాభివృద్ధికి కృషి చేశారని పలువురు కొనియాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అంకితభావం, సేవ దేశానికి ‘అమృత్ కాల్’ లో స్పూర్తిగా నిలుస్తుందని, 2047లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ల పూర్తి చేసుకునే వరకు ఈ స్పూర్తి ఇలాగే ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. బీజేపీ మూలస్తంభాల్లో వాజ్‌పేయిని ఒకరుగా చెప్పుకుంటారు. 1999 నుంచి 2004 వరకు ఆయన ఎన్డీయే కూటమికి ప్రధానిగా ఉన్నారు. వాజ్‌పేయి సమయంలోనే పాకిస్తాన్‌తో జరిగిన కార్గి్ల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది.