ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బ్రహ్మోస్ క్షిపణులు మన దేశ శత్రువులకు నిద్ర లేకుండా చేశాయని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ త్రివిధ దళాలను, ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సోదరీమణుల కోపాన్ని ప్రపంచమంతా చూసిందని తెలిపారు. పాకిస్థాన్ లోపల.. వందల మైళ్ల లోపల.. వారి ఇళ్లల్లోకి చొరబడి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ గజగజలాడిందని.. దెబ్బతో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక సర్వే..!
ఉగ్రదాడులపై భారత్ ఎప్పుడూ తీవ్రంగా స్పందిస్తుందని.. సైన్యం సమయం, ప్రణాళికలు వేసుకుని దాడి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక అణు బెదిరింపులకు భారత్ ఎప్పుడూ భయపడదని తెలిపారు. స్వచ్ఛమైన కాన్పూర్ శైలిలో చెప్పాలంటే.. శత్రువు ఎక్కడున్నా వాళ్ల అంతు చూస్తామని మోడీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy: “జాబితా ఫైనల్ అయ్యింది”.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన..
కేవలం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలనే ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించినట్లు చెప్పారు. ప్రపంచమంతా మేక్ ఇన్ ఇండియా శక్తిని.. మన దేశీ ఆయుధాలను చూసిందన్నారు. ఇక మన బ్రహ్మోస్ క్షిపణులు శత్రు భూభాగంలోకి ప్రవేశించి లక్ష్యాలను గుర్తించి విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. రక్షణ రంగంలోని పెద్ద కంపెనీలన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయని.. అమేథీకి సమీపంలోనే ఏకే-203 రైఫిల్ ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. బ్రహ్మోస్ కొత్త చిరునామా ఉత్తరప్రదేశేనని మోడీ ప్రకటించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
