ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం దేశ రాజధానిలో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాణిజ్య భవన్‌ను ప్రారంభించారు. ఇండియా గేట్ సమీపంలో నిర్మించబడిన వాణిజ్య భవన్ ఒక స్మార్ట్ భవనం వలె రూపొందించబడింది. ఇది ఇంధన ఆదాపై ప్రత్యేక దృష్టితో స్థిరమైన నిర్మాణ సూత్రాలను కలిగి ఉంటుంది. నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర‍్లీ అనాలసిస్ ఆఫ్ ట్రేడ్ (ఎన్‌ఐఆర్‌వైఏటీ) పోర్టల్‌ని ప్రధాని మోడీ లాంచ్ చేశారు.
ఈ పోర‍్టల్ స్టేక్ హోల్డర్లకు ఒక వేదికలా ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు. ఇది మినిస్ట్రీ కింద ఉన్న రెండు డిపార్ట్‌మెంట్‌లు, అంటే వాణిజ్య శాఖ మరియు పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (DPIIT) ద్వారా ఉపయోగించబడే సమీకృత మరియు ఆధునిక కార్యాలయ సముదాయంగా పనిచేయనుంది.