Ram Nath Kovind Autobiography: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రచించిన ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ పేరుతో కోవింద్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో ఆయన వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజా జీవితంలో సాగించిన ప్రస్థానం వంటి అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. రామ్‌నాథ్ కోవింద్ జీవితాన్ని కొనియాడారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కోవింద్ సాధారణ పౌరుడి స్థాయి నుంచి భారత రాష్ట్రపతిగా ఎదిగారని తెలిపారు. భారత ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ అవకాశాలను కల్పిస్తుందనే విషయానికి కోవింద్ జీవితం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.
ప్రజాసేవలో రామ్‌నాథ్ కోవింద్ చూపించిన వినయం, క్రమశిక్షణ, విలువలు నేటి యువతకు ఆదర్శమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలకు కోవింద్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తినిస్తూ.. కష్టాలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదగాలనే సందేశాన్ని అందిస్తుందని అన్నారు. కోవింద్ తన ఆత్మకథకు ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ అనే పేరు ఎంచుకోవడం ఎంతో సముచితమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిగత అనుభవాలు, పోరాటాలు, ప్రజా జీవితంలోని అనుభవాలను పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు.
రామ్‌నాథ్ కోవింద్ రాసిన ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి జీవిత కథ మాత్రమే కాదని, భారత ప్రజాస్వామ్య విలువలకు ఒక విలువైన వారసత్వంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కోవింద్ జీవితం ద్వారా ప్రజాసేవలో విలువలు, నిబద్ధత, క్రమశిక్షణ ఎంత ముఖ్యమో యువత తెలుసుకోవచ్చని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ..

