Site icon NTV Telugu

‘ఈ-రూపీ’ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

e RUPI

e RUPI

నగదు లావాదేవీలకు క్రమంగా స్వస్తి చెబుతూ.. డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు అడుగులు వేస్తోంది భారత్.. ఇక, డిజిటల్‌ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఎల‌క్ట్రానిక్ వోచ‌ర్ ఈ-రూపీని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ… వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈరూపీ వోచ‌ర్‌ను రిలీజ్ చేశారు ప్రధాని… డిజిట‌ల్ లావాదేవీలు, నేరుగా న‌గ‌దు బ‌దిలీ విష‌యంలో దేశంలో ఈరూపీ కీల‌క‌పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. పార‌ద‌ర్శకంగా ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా న‌గ‌దును డెలివ‌రీ చేయవచ్చన్న ఆయన.. అత్యాధునిక టెక్నాల‌జీ సాయంతో 21వ శ‌తాబ్ధంలో భారత్‌ ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహ‌ర‌ణ‌గా భావించ‌వ‌చ్చు అని వ్యాఖ్యానించారు. క్యూర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఈ వోచ‌ర్‌ను పంపిస్తారని.. ల‌బ్ధిదారుల మొబైల్‌కు ఆ వోచ‌ర్‌ను డెలివ‌రీ చేస్తారని.. దాని ద్వారా అమౌంట్‌ను వాడుకోవచ్చు అని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ.

Exit mobile version