NTV Telugu Site icon

PM Modi: యూకే కొత్త ప్రధాని కైర్ స్టార్‌మన్‌కి అభినందనలు తెలిపిన మోడీ..

Pm Modi

Pm Modi

PM Modi: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ, అధికార రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీని చిత్తుగా ఓడించింది. యూకే ప్రజలు లేబర్ పార్టీకి గణనీయమైన అధికారాన్ని కట్టబెట్టారు. కొత్త ప్రధానిగా కైర్‌ స్టార్‌మన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, యూకేకి కాబోతున్న పీఎం కైర్‌ స్టార్‌మన్‌తో శనివారం మాట్లాడారు. విజయం పట్ల ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇరు దేశాలకు లాభదాయకమైన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకునేందుకు కృషి చేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు.

Read Also: Union Budget 2024: జూలై 23న మోడీ సర్కార్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్..

ఇరువురు నేతలు భారత్, బ్రిటన్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను గుర్తు చేసుకున్నారని, దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. యూకే సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలో భారతీయ కమ్యూనిటీ సహకారాన్ని అభినందిస్తూనే, సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించాలని ఇరువురు అంగీకరించారు. మోడీ, స్టార్‌మన్‌ని భారత్‌లో పర్యటించాలని ఆహ్వానించారని ప్రకటన తెలిపింది.