దేశంలో మరో అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు రెడీ అయింది. ఈ విమానాశ్రయం దేశ రాజధాని ప్రజలకు విమాన ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఈ ఎయిర్‌పోర్టును ప్రధాని మోడీ శనివారం ప్రారంభించనున్నారు. అయితే దీన్ని ఎక్కడ నిర్మించారు. విశేషాలు తెలియాలంటే ఈ వార్త చదవండి.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉంది. ఒక్కోసారి కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. దీంతో ఎప్పటినుంచో మరో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మించాలని డిమాండ్ ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రూ.11,200 కోట్ల వ్యయంతో నోయిడాలోని జేవార్ ప్రాంతంలో రెండో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఈ విమానాశ్రయాన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించారు. 3,900 మీటర్ల పొడవైన రన్‌వే.. ఏటా 12 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణం చేసేలా అత్యంత అద్భుతంగా నిర్మించారు. తాజాగా ఓపెనింగ్‌కు సిద్ధమైంది.
రేపు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ (ఫేజ్-1) ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అనంతరం టెర్మినల్‌ను మోడీ పరిశీలించనున్నారు. ఇక ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభం కాగానే ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణీకుల రద్దీ తగ్గి.. విమానాల సామర్థ్యం పెరుగుతుంది.
ముఖ్యాంశాలు..
మొదటి దశలో విమానాశ్రయం సంవత్సరానికి 12 మిలియన్ల (2 కోట్ల) మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు
తదుపరి దశలలో ఈ సామర్థ్యాన్ని 70 మిలియన్ల (7 కోట్ల) మంది ప్రయాణికులకు విస్తరింపజేస్తారు.
3,900 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మించారు. ఇది పెద్ద (వైడ్-బాడీ) విమానాలకు అనువుగా ఉంటుంది.
ఆధునిక నావిగేషన్ వ్యవస్థలు, ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), ఆధునిక లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ఈ విమానాశ్రయం యమునా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఉంది. మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా రూపొందించారు. ఇది రోడ్డు, రైలు, మెట్రో, ఇతర ప్రాంతీయ రవాణా మార్గాల ద్వారా అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది. విమానాశ్రయం డిజైన్, ఘాట్‌లు, భవనాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటల విమాన సర్వీసులను అందించనుంది.
