Site icon NTV Telugu

Bengaluru: మెట్రో ఎల్లో లైన్‌ను ప్రారంభించిన మోడీ.. కాసేపు నవ్వుకున్న నేతలు

Modi22

Modi22

ప్రధాని మోడీ ఆదివారం బెంగళూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు నుంచి బెళగావి, అమృత్సర్, నాగ్‌పూర్‌లను అనుసంధానించే మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం బెంగళూరు-బెళగావి వందేభారత్‌ రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా.. నగరంలోని ఆర్‌వీరోడ్డు- బొమ్మసంద్ర మధ్య ఎల్లో లైన్‌ మార్గాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవంతో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 150కి చేరింది. కర్ణాటకలో 11 రైళ్లు ఉన్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లో కూడా హై-స్పీడ్ రైలు నడుస్తున్నాయి.

నవ్వులు.. పువ్వులు..
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్, ఇతర నాయకులు బెంగళూరు మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా నాయకులంతా కొద్ది సేపు ఉల్లాసంగా కనిపించారు. మోడీ సహా అందరూ కాసేపు నవ్వుకున్నారు. అయితే ఎందుకు నవ్వుకున్నారో మాత్రం తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Exit mobile version