Site icon NTV Telugu

PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ

Modi

Modi

ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చినాబ్ రైల్వే వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ సొంతం. అలాంటి రైల్వే వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం జాతికి అంకింతం చేశారు. రూ.46,000 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం ప్రధానంగా పర్యాటరంగాన్ని మరింత ఆకర్షించనుంది. శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని వందలాది మంది యాత్రికులు దర్శిస్తుంటారు. ఈ రైల్వే వంతెన ప్రారంభంతో పర్యాటకరంగంగా మరింత పుంజుకోనుంది.

ఇది కూడా చదవండి: Bunny Vasu: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!

ఈ చినాబ్ బ్రిడ్జి 1,315 మీటర్లు విస్తరించి ఉంది. కఠినమైన వాతావరణాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ ప్రాంతం భూకంపం జోన్ 5లో ఉంది. ఇంజనీర్లు అత్యంత అద్భుతంగా ప్రణాళికలు వేసి ఈ బ్రిడ్జిని నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచినా ఈ వంతెనకు ఏం కాదు. బలమైన గాలులు తట్టుకునే విధంగా నిర్మించారు. ఇక వంతెన నిర్మించడానికి దాదాపు 30,000 టన్నుల ఉక్కును ఉపయోగించారు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా నిలుస్తుంది. చీనాబ్ వంతెన నిర్మాణం 2002లో ప్రారంభించగా 2022లో పూర్తైంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి విజయవంతంగా ముగించారు. రేపటి నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందే భారత్ రైళ్లు పరిగెత్తనున్నాయి. ప్రారంభోత్స సమయంలో ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు.

ఇది కూడా చదవండి: OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్‌ హిట్‌ మూవీ!

 

 

 

Exit mobile version