Site icon NTV Telugu

PM Narendra Modi: ఇది యుద్ధానికి సమయం కాదు మిత్రమా.. పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ

Modi And Putin

Modi And Putin

PM Modi holds bilateral talks with Russian President Putin: ఉజ్జెకిస్తాన్ లో జరుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సమావేశంలో పాల్గొనేందుకు సమర్ కండ్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా, ఉక్రెయిన్ ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో తొలిసారిగా సమావేశం అయ్యారు. ఇరు దేశాల కూడా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల యుగం కాదని ఆయన పుతిన్ తో అన్నారు. ప్రస్తుతం యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ఇంధన సంక్షోభాన్ని పెంచిందని పుతిన్ తో అన్నారు. ఇది యుద్ధానికి సమయం కాదని పుతిన్ తో మోదీ వ్యాఖ్యానించారు. ఇది వరకు ఈ విషయం గురించి మీతో ఫోన్లో మాట్లాడానని గుర్తు చేశారు. ఈ సమావేశానికి ముందు టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగన్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఇండియా-టర్కీ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకునే అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు.

Read Also: Mars: అంగారకుడిపై జీవ ఆనవాళ్లు కనుక్కున్న పర్సవరెన్స్ రోవర్

భారత్-రష్యా దశాబ్ధాలుగా ఒకరితో ఒకరు ఉన్నారని.. ఆహారం, ఇంధనం, భద్రత, ఎరువుల సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను కనుక్కోవాలని ఇరు దేశాధినేతలు భావించారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తరలించడానికి రష్యా, ఉక్రెయిన్ దేశాలు సహకరించాయని.. అందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నానని మోదీ, పుతిన్ తో అన్నారు. ఉక్రెయిన్-రష్యా సంఘర్షణ గురించి నాకు తెలుసని.. వీటన్నింటిని త్వరలో ముగించాలని కోరుకుంటున్నట్లు.. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియజేస్తామని ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

వచ్చే ఏడాది 2023లో ఎస్‌సిఓకు భారత్ నాయకత్వం వహించబోతోంది. వచ్చే ఏడాది ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఇండియాలో జరగనున్నాయి. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటిలో పాటు నాలుగు పరిశీలహోదా దేశాలుగా ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, మంగోలియా, ఇరాన్ దేశాలు ఉన్నాయి. ఆరు దేశాలు ఆర్మేనియా, అజర్ బైజాన్, టర్కీ, కంబోడియా, శ్రీలంక, నేపాల్ దేశాలు డైలాగ్ పార్ట్నర్స్ గా ఉన్నాయి.

Exit mobile version