Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
- పుతిన్‌కు మోడీ ‘‘తిరుక్కురళ్’’ బహుమతి..
- తమిళ సాహిత్య గ్రంధానికి రష్యన్ లింక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thirukkural: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రాచీన తమిళ గ్రంథం, తిరువళ్లవర్ రచించిన ‘‘తిరుక్కురళ్’’ రష్యన్ అనువాదాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రంథం విశిష్టతను మోడీ, పుతిన్‌కు వివరించారు. అయితే, ఈ గ్రంథం ఏమిటి అని చాలా మందిలో ఆసక్తి పెరిగింది.
మనిషి జీవనం, రాజు రాజ్య పాలనకు సంబంధించిన అనేక అంశాలను తిరుక్కరళ్ చర్చిస్తుంది. సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలి, మంత్రులు ఎలా ప్రవర్తించాలని 2000 ఏళ్ల నాటి ఈ గ్రంథంలో రచించారు. ఇందులోని రష్యా ప్రజలను కూడా ప్రేరేపిస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2026లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ప్రచురించిన ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అసలు తమిళ పద్యాలతో దాని రష్యన్ లిపి, రష్యన్ అనువాదం ఉన్నాయి. నైరా మ్కర్ట్‌చ్యాన్ ఈ రష్యన్ అనువాదాన్ని చేశారు.
Also Read
- PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
- Modi-Putin: "కార్ డిప్లమసీ".. ఒకే కారులో మోడీ-పుతిన్..
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
రష్యాతో లింక్..
ఈ బహుమతికి మరో ప్రత్యేకత కూడా ఉంది. భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యంపై రష్యాలో ఆసక్తికి శతాబ్ధాల చరిత్ర ఉంది. 17వ శతాబ్ధం నుంచే రష్యాలో భారతీయ తత్వంపై ఆసక్తి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. యూరోపియన్ అనువాదాల ద్వారా తిరుక్కురళ్ కూడా రష్యన్ మేధావులు, సాహితీవేత్తల్ని ఆకర్షించింది.
రష్యా రచయిత లియో టాల్‌స్టాయ్ 19వ శతాబ్ధంలో తిరుక్కురళ్తో సంబంధం ఏర్పడినట్లు చెబుతుంటారు. ధర్మం, కరుణ, అహింస వంటి అంశాలను తిరుక్కురళ్ ప్రస్తావిస్తుందని, ఇవి టాల్‌స్టాయ్ తాత్విక ఆలోచనలపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు ఉన్నాయి. టాల్‌స్టాయ్, మహాత్మా గంధీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో దీని ప్రస్తావన ఉన్నట్లు చెబుతుంటారు. టాల్‌స్టాయ్ మహాత్మా గాంధీకి తిరుక్కురళ్న సూచించారని, దాని బోధనల వల్లే గాంధీ అహింసా సిద్ధాంతంపై ప్రభావం చూపాయని చెబుతుంటారు.
మూడు భాగాలుగా తిరుక్కురళ్..
తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్లో మొత్తం 1330 ద్విపదలు, 133 అధ్యాయాలు ఉన్నాయి. ఇది 3 విభాగాలుగా ఉంటుంది. అరం(ధర్మం), పొరుల్(అర్థం), ఇన్బమ్ (కామం) అనేవి విభాగాలుగా ఉన్నాయి. హిందూ తత్వంలోని ధర్మ, అర్థ, కామ భావనలతో పోలిక ఉంటుంది. అయితే, మోక్షం గురించి దీనిలో ప్రస్తావన లేదు. క్రీస్తుపూర్వం 300 నుంచి క్రీ.శ 500 మధ్య తిరుక్కురళ్ రచించబడినట్లు భావిస్తుంటారు.
మోడీ గతంలో 2019లో బ్యాంకాక్‌లో థాయ్ అనువాదాన్ని ఆవిష్కరించారు. అప్పటి జపాన్ ప్రధానికి తిరుక్కురళ్ జపనీస్ అనువాదాన్ని అందించారు. 2023లో పాపువా న్యూగినియాలో జరిగిన ఒక సదస్సులో టోక్ పిసిన్ అనువాదాన్ని ఆవిష్కరించారు. ఇటీవల, 2026 ఆగస్టులో తాష్కెంట్ పర్యటన సందర్భంగా తిరుక్కురళ్ ఉజ్బెక్ భాషలోకి అనువదించాలని ప్రతిపాదించారు.
తాజావార్తలు
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?