PM Narendra Modi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. “ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 54వ ఏట అడుగుపెట్టిన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. “థ్యాంక్యూ సార్’’ అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించిన కేజ్రీవాల్,, “మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు” అని ట్వీట్ చేశారు. అంతకుముందు దేశ రాజధానిలోని వాజ్‌పేయ్ స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ప్రముఖ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.మాజీ ప్రధాని వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు.
Atal Bihari Vajpayee: రాజకీయ దురంధరుడు వాజ్‌పేయ్ వర్ధంతి.. ప్రముఖుల నివాళి
అటల్ బీహార్ వాజ్‌పేయి రెండుసార్లు దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు – 1996లో మరియు 1999లో. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన వాజ్‌పేయ్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చేరారు. 2015లో ఆయన పుట్టిన రోజున భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25వ తేదీని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా కూడా ప్రకటించింది. భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మొదటి కాంగ్రెసేతర రాజకీయ నాయకుడు. ఆయన ఆగస్టు 16, 2018న మరణించారు.