NTV Telugu Site icon

PM Modi: షాంఘై సదస్సుకు మోడీ దూరం.. వెళ్లనున్న కేంద్రమంత్రి

Pm

Pm

వచ్చే నెలలో కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు ప్రధాని మోడీ దూరం అయ్యారు. మోడీ తరపున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. భారత ప్రతినిధి బృందానికి కేంద్రమంత్రి నాయకత్వం వహించనున్నారు .

జులై 3-4 తేదీల్లో జరగనున్న షాంఘై సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతారని తొలుత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఆయన వెళ్లడం లేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో చెప్పారు. గత ఏడాది ఎస్‌సీవో సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వగా చైనా, రష్యా ప్రధానులు రాలేమని చెప్పడంతో వర్చువల్‌గా సదస్సును నిర్వహించారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: రేపు వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు

మోడీ వెళ్లకపోవడానికి కారణాలను తెలియజేయలేదు. అయితే చైనాతో సంబంధాలు దెబ్బతిన్న కారణాన పర్యటనకు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంగళవారం ప్రెసిడెంట్ కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ నుంచి ప్రధాని మోడీకి ఫోన్ కాల్ వచ్చినప్పుడు భారతదేశం తన వైఖరిని కజకిస్తాన్‌కు తెలియజేసినట్లు సమాచారం.

SCOలోని తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి. భారతదేశం, చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. కోవిడ్-19 మహమ్మారి ప్రారంభానికి ముందు జరిగిన శిఖరాగ్ర సమావేశాలకు మోడీ హాజరయ్యారు. ఇక 2022లో ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చించడానికి శిఖరాగ్ర సమావేశానికి ఉజ్బెకిస్తాన్‌కు మోడీ వెళ్లారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్