NTV Telugu Site icon

Rozgar Mela: ప్రధాని మోదీ చేతుల మీదుగా 51,000 అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ

Pm Modi

Pm Modi

Rozgar Mela: ప్రధాని నరేంద్రమోడీ సోమవారం రోజ్‌గార్ మేళాలో భాగంగా 51,000 మందికి అపాయింట్మెంట్లు లెటర్లు పంపిణీ చేశారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిని ప్రధాని మోడీ కొత్తగా ఉద్యోగాల్లో చేరబోతున్న వారిని ‘ అమృత రక్షకులు’గా పేర్కొన్నారు. ఉద్యోగాల్లో చేరుతున్న వారికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఉద్యోగాలు ఎక్కువగా పారా మిలిటరీ దళాల్లో ఉండనున్నాయి.

Read Also: Afghanistan: మహిళలపై మరో ఆంక్ష విధించిన తాలిబన్ ప్రభుత్వం.. మరీ ఇంత దారుణమా?

గతేడాది కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ సారి దేశం గర్వంగా, ఆత్మవిశ్వాసంగా రోజ్‌గార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందని అన్నారు. మన చంద్రయాన్, రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుని నుండి చారిత్రాత్మక ఫోటోలను నిరంతరం పంపుతున్నాయని ఆయన అన్నారు. ఈ దశాబ్ధంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవప్థలో భారత్ మూడో స్థానంలోకి చేరుతుందని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.

ఆహారం నుంచి ఫార్మా వరకు అంతరిక్షం నుంచి స్టార్టప్స్ వరకు అన్ని రంగాలు అభివృద్ధి చెందడం ఆర్థిక వ్యవస్థకు అవసరమని ప్రధాని అన్నారు. దేశంలో ఆటోమొబైల్స్, ఫార్మా రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో యువతకు భారీ ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. 2030 నాటికి పర్యాటక రంగంమ వాటా భారత ఆర్థిక వ్యవస్థకు రూ. 20 లక్షల కోట్లకు చేరుతుందని అన్నారు. దీని ద్వారా 13-14 కోట్ల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. భారతదేశ ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెట్ గతేడాది రూ.25 లక్షల కోట్లకు చేరుకోగా.. రాబోయే మూడేళ్లలో ఈ రంగం రూ. 35 కోట్లకు చేరుతుందని ప్రధాని అన్నారు.

Show comments