Site icon NTV Telugu

PM Modi: మమత సర్కార్‌పై మోడీ తీవ్ర విమర్శలు.. ‘నిర్మంత’ అంటూ వ్యాఖ్య

Pmmodi

Pmmodi

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. హింస చెలరేగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ముర్షిదాబాద్, మాల్డాలో జరిగిన హింసను ఉద్దేశించి మమతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందీలో క్రూరత్వం అని అర్థం వచ్చేలా మమతను ‘నిర్మంత’ అనే మాటను ఉపయోగించారు. ‘క్రూరత్వం లేదా ఉదాసీనతకు ప్రతీక అని అర్థం వస్తుంది. శాంతిభద్రతలను కాపాడటంలో మమత సర్కార్ పూర్తిగా విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. పౌరుల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: YS Jagan: మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్‌.. గాయపడిన వృద్ధురాలిని..!

గురువారం పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇండియా… విక్షిత్ భారత్‌గా మారాలంటే.. పశ్చిమ బెంగాల్‌ను కూడా విక్షిత్ పశ్చిమ బెంగాల్‌గా మార్చడం ముఖ్యమని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు కొత్త శక్తిని నింపాల్సిన అవసరం ఉందని.. జ్ఞానం.. విజ్ఞాన కేంద్రంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ileana D’Cruz: మళ్లీ తల్లికాబోతున్న హీరోయిన్.. నెట్టింట బేబీ బంప్ ఫోటో వైరల్..!

నేడు పశ్చిమ బెంగాల్ అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. మొదటి సంక్షోభం.. సమాజంలో హింస, అరాచకం ప్రబలంగా ఉందని తెలిపారు. రెండోవ సంక్షోభం.. తల్లులు, సోదరీమణులు సురక్షితంగా లేరని.. వారిపై నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. మూడోవ సంక్షోభం.. యువత అనుభవిస్తున్న నిరాశ, నిరుద్యోగం అన్నారు. నాల్గోవ సంక్షోభం.. అవినీతి, వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోవడం.. ఐదో సంక్షోభం.. పేద ప్రజల హక్కులను స్వార్థ రాజకీయాల కోసం పాలక పార్టీ లాక్కుంటోందని మోడీ విమర్శించారు.

ఇక అలిపుదుర్‌లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్‌కు మోడీ శంకుస్థాపన చేశారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు మరియు పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం వేగం అందిస్తోంది. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి భారతదేశ పురోగతికి పునాది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్ట్ ద్వారా ప్రజలు ఇకపై సిలిండర్లు కొనవలసిన అవసరం ఉండదు. గృహాల్లో సురక్షితమైన గ్యాస్ పంపిణీ అందించబడుతుంది. ఇది డబ్బు, సమయం ఆదా చేస్తుంది. పర్యావరణానికి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ విధానాల ఇంటింటికీ డెలివరీకి ఒక ఉదాహరణ” అని మోడీ అన్నారు.

Exit mobile version