Site icon NTV Telugu

PM Modi: యువతకు బీజేపీ ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోంది.. విపక్షంపై మోడీ విమర్శలు

Modi3

Modi3

ఇండియా కూటమి లక్ష్యంగా మరోసారి ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీతామర్హిలో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. యువతకు మేము ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోందని విరుచుకుపడ్డారు. తొలి దశ ఎన్నికల్లో జంగిల్ రాజ్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు.

ఇది కూడా చదవండి: Trump: వివేక్‌ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు.. గవర్నర్‌ ఎన్నికల్లో మద్దతు

తేజస్వి యాదవ్ ఒక పిల్లవాడు అని.. ముఖ్యమంత్రైతే ‘రంగ్‌దార్’ (రౌడీ) అవుతారని వ్యాఖ్యానించారు. ‘‘బీహార్ పిల్లల కోసం ఆర్జేడీ ఏమి చేయాలనుకుంటుందో వారి నాయకుల ఎన్నికల ప్రచారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జంగిల్ రాజ్ మద్దతుదారుల పాటలు, నినాదాలు వినండి. వారి మాటలకు ప్రజలు భయపడిపోతున్నారు. అమాయక పిల్లలను ఆర్జేడీ వేదికలపై గ్యాంగ్‌స్టర్లుగా మారాలనుకుంటున్నారని చెప్పమని బలవంతం చేస్తున్నారు.’’ అని మోడీ పేర్కొన్నారు. ఇకపై బీహారీయులు తుపాకీ ప్రభుత్వాన్ని కోరుకోవద్దని.. వాళ్లకు ఓటు వేస్తే ప్రమాదమని మోడీ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: JK Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ముగిసింది. 121 స్థానాల్లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. మంగళవారం 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.

 

Exit mobile version