Site icon NTV Telugu

PM Modi: ఆస్ట్రేలియా ఎన్నికల్లో ప్రధాని ఆంథోనీ అల్బనీస్ విజయం.. పీఎం మోడీ అభినందనలు..

Anthony Albanese

Anthony Albanese

PM Modi: ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి, ప్రధానిగా ఆంథోని అల్బనీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆంథోనీ అల్బనీస్‌కి ప్రధాని నరేంద్రమోడీ శనివారం అభినందనలు తెలియజేశారు. భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పారు. 21 ఏళ్ల చరిత్రలో అల్బనీస్ వరసగా రెండుసార్లు విజయం సాధించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.

Read Also: Panipuri : మీకు పానీపూరి ఇష్టమా.. ఇక్కడ పానీపూరితో పాటు అది ఫ్రీ

‘‘ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా మీరు అఖండ విజయం సాధించి తిరిగి ఎన్నికైనందుకు ఆంథోనీ అల్బనీస్‌కి అభినందనలు! ఈ దృఢమైన తీర్పు మీ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రజల శాశ్వత విశ్వాసాన్ని సూచిస్తుంది’’ అని ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి, ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం మా ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లుగా మోడీ చెప్పారు.

Exit mobile version