Site icon NTV Telugu

పార్లమెంట్‌ సమావేశాలు : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

ఇవాళ్టి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఆగ‌స్టు 13 వ‌ర‌కు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. మొత్తం 20 రోజుల‌పాటు స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల సభ్యులు పార్లమెంటు ఉభయసభలలో చాలా కఠినమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని చెప్పిన మోడీ… ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే అభివృద్ధి వేగాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించేందుకు అవసరమైన అనుకూల వాతావరణం కూడా ఉండాలని ఆయన తెలిపారు.

Exit mobile version