ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. భారత రాష్ట్రపతిగా కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియడానికి కొన్ని రోజుల ముందు ఈ సమావేశం జరగడం గమనార్హం. భారత 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ కాగా.. ఎన్నికలు జూలై 18న జరగాల్సి ఉంది. జూన్ 15న ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాజ్యాంగం ప్రకారం దామాషా ప్రాతినిధ్య విధానంలో రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించబడుతుంది.లోక్‌సభ, రాజ్యసభ మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇందులో ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభలు కూడా ఉన్నాయి.
Supreme Court: అగ్నిపథ్‌పై పిటిషన్లు.. ఈ నెల 15న విచారించనున్న సుప్రీంకోర్టు
పార్లమెంట్ హౌస్, రాష్ట్ర శాసనసభల ప్రాంగణంలో పోలింగ్ జరుగుతుంది.776 మంది పార్లమెంట్ సభ్యులు, 4,033 మంది శాసన సభ సభ్యులతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 4,809. భారత ఎన్నికల సంఘంనిర్ణీత బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ప్రత్యేక పెన్నులు, ఇతర సీలు చేసిన ఎన్నికల సామగ్రిని జాతీయ రాజధాని ఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సహా రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్‌లకు పంపిణీ చేయడం ప్రారంభించింది. ఈ నెల 18న మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా గిరిజన మహిళా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన అభ్యర్థిత్వం కోసం జూన్ 24న ఎన్డీయే తరఫున తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హా జూన్ 27న తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.