PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..

  • పూరీ తీరంలో అద్భుత దృశ్యం
  • మోడీ కోసం 2,500 దీపాలతో సైకత శిల్పం
Pm Modi 76th Birthday Sand

Pm Modi 76th Birthday Sand

PM Modi 76th Birthday Celebration: ప్రధాని నరేంద్ర మోడీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ 25 అడుగుల పొడవైన ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ కళాకృతిని ఏకంగా 2,500 మట్టి దీపాలతో అలంకరించారు.

‘A Diya of Blessings’.. 2,500 దీపాలతో ప్రత్యేక సందేశం

ప్రధాని మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని రూపొందించిన ఈ సాండ్ ఆర్ట్ కు ‘A Diya of Blessings’ అనే సందేశాన్ని అందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని కోసం ప్రార్థనలు చేస్తూ దీపాలు వెలిగిస్తున్నారనే భావనను ఈ కళాకృతి ప్రతిబింబిస్తుందని సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. 25 అడుగుల ఇసుక కళాకృతిని 2,500 మట్టి దీపాలతో అలంకరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రజల ఆశీస్సులు, శుభాకాంక్షలను ఈ కళ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు.

పూరీ తీరంలో ప్రత్యేక ఆకర్షణగా ఇసుక కళలు

ప్రధాని మోడీ 76వ పుట్టినరోజు సందర్భంగా పూరీ బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్, మానస్ కుమార్ సాహూ రూపొందించిన రెండు ప్రత్యేక ఇసుక కళాకృతులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు 25 అడుగుల ఇసుక కళను 2,500 దీపాలతో అలంకరించగా.. మరోవైపు మోడీ పుట్టినరోజుతో పాటు విశ్వకర్మ పూజ, పలు జాతీయ కార్యక్రమాలను ప్రతిబింబించేలా మరో కళాకృతిని రూపొందించారు. దీంతో పూరీ తీరంలో ఇసుక కళలు, దీపాలు, శుభాకాంక్షల సందేశాలతో ప్రత్యేక వాతావరణం నెలకొంది.