PM Modi @ Brunei: బ్రూనై దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ..
- బ్రూనై దేశానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ..
- మోడీకి ఘన స్వాగతం పలికిన క్రౌన్ ప్రిన్స్
- హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్..
- ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు రాజకుటుంబీకులతో మోడీ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi @ Brunei: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (మంగళవారం) బ్రూనై దేశానికి చేరుకున్నారు. మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు. ఇక, తన పర్యటనలో, సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనై రాజ కుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాలను ఈ టూర్ లో బలోపేతం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన ట్వీట్‌లో “బ్రూనై దారుస్సలాంలో అడుగుపెట్టాను.. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాం.. ముఖ్యంగా వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను పెంచడంలో ఈ పర్యటన ఎంతో ముఖ్యమైంది అన్నారు.
Read Also: Manjira River: ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
అలాగే, భారతదేశం- బ్రూనై దేశాల మధ్య 40 సంవత్సరాల దౌత్య సంబంధాలను జరుపుకుంటున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా పోస్ట్‌లో తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రూనైకు చేరుకున్నారు.. ఇది ఒక భారతీయ ప్రధానమంత్రి యొక్క మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన అని చెప్పుకొచ్చారు. ఇక, బ్రూనై పర్యటనలో సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా, ఇతర రాజకుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన తర్వాత ప్రధాని మోడీ సింగపూర్ పర్యటనకు రేపు ( బుధవారం) సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు.
Landed in Brunei Darussalam. Looking forward to strong ties between our nations, especially in boosting commercial and cultural linkages. I thank Crown Prince His Royal Highness Prince Haji Al-Muhtadee Billah for welcoming me at the airport. pic.twitter.com/azcZywzjCh
— Narendra Modi (@narendramodi) September 3, 2024
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!