Site icon NTV Telugu

Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, ఛాన్సలర్ మెర్జ్

Modi

Modi

ప్రధాని మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సందడి చేశారు. సబర్మతి నదీ తీరంలో అంతర్జాతీయ గాలి పటాల ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఇద్దరు కలిసి గాలి పటాలు ఎగరవేశారు. తొలుత సమర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అటు తర్వాత గాలిపటాల పండుగను ప్రారంభించారు. ఇక వేదిక దగ్గర మోడీ, మోర్జ్ మహిళా కళాకారులతో సంభాషించారు. గాలి పటాల తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఉత్సవం జనవరి 14 వరకు కొనసాగనుంది.

Exit mobile version