ప్రపంచ ప్రజలు భారత్ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో మోడీ పాల్గొని ప్రసంగించారు. భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్నాయని చెప్పారు. ప్రపంచం మొత్తం భారత్ గురించి ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల ప్రజలు భారత్‌కు రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచ కర్మాగారంగా భారత్ రూపొందుతోందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్..
ఇన్నేళ్లు భారతదేశం శ్రామిక శక్తిగా చెప్పుకునేవారని.. ప్రస్తుతం ప్రపంచ శక్తిగా మార్పు చెందిందని తెలిపారు. దేశంలో లభించే సూపర్‌ఫుడ్‌లైన మఖానా, మిల్లెట్‌లు, ఆయుష్ ఉత్పత్తులు… మనం పాటించే యోగా, ధ్యానం వంటి వాటిని విదేశీయులు మనలను చూసి ఆచరిస్తున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మూడోసారి పట్టం కట్టడం తమపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని సంతోషం వ్యక్తంచేశారు. భారత్ అభివృద్ధిలో ముందడుగు వేస్తూ అనేక ప్రపంచవ్యాప్త కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోందని అన్నారు.
ఇది కూడా చదవండి: Bandla Ganesh: బండ్ల గణేష్ పాదయాత్ర
Addressing the NXT Conclave in Delhi. @nxt_conclave https://t.co/kdcwYCuxYU
— Narendra Modi (@narendramodi) March 1, 2025