PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్‌డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?

  • ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్ డేట్
  • పీఎం కిసాన్ 23వ విడత జూన్ 18న వస్తుందా?
  • జూన్ 18 గురించి ఎందుకు చర్చిస్తున్నారు?
Pm Kisan 23rd Installment

Pm Kisan 23rd Installment

నైరుతి రుతుపవనాల పలకరింపుతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో తొలకరిజల్లులు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి అవసరమవడంతో రైతన్నలు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ (PM-KISAN) పథకం 23వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 18 తేదీపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ రోజే రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ కావచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

జూన్ 18న 23వ విడత విడుదల అవుతుందా?

పీఎం కిసాన్ పథకం కింద 22వ విడతను 2026 మార్చి 13న విడుదల చేశారు. దీంతో తదుపరి విడత ఎప్పుడు వస్తుందనే ఆసక్తి రైతుల్లో నెలకొంది. ప్రస్తుతం జూన్ 18 తేదీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి అధికారిక ధృవీకరణ లేనందున ఆ రోజే నిధులు విడుదల అవుతాయని చెప్పలేం.

×
×
Ad

జూన్ 18 తేదీపై చర్చ ఎందుకు?

2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 18న పీఎం కిసాన్ 17వ విడతను విడుదల చేశారు. ఆ సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా 9.26 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు రూ.20,000 కోట్లకుపైగా బదిలీ చేశారు. ఆ గత అనుభవం ఆధారంగా ఈసారి కూడా జూన్ 18న విడత విడుదల కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని కేవలం ఊహాగానంగానే పరిగణించాలి.

జూన్‌లో విడుదలయ్యే అవకాశాలు ఎంత?

సాధారణంగా పీఎం కిసాన్ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడత విడుదల చేస్తారు. 22వ విడత మార్చి మధ్యలో విడుదల కావడంతో, 23వ విడత జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన తేదీపై స్పష్టత రావాలంటే కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

రైతులు ఏం చేయాలి?

పీఎం కిసాన్ పోర్టల్‌లో e-KYC పూర్తి చేసి ఉండాలి.
ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి.
భూ రికార్డుల ధృవీకరణ పూర్తైందో లేదో చూసుకోవాలి.
అధికారిక ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలి.

ప్రస్తుతం 23వ విడత విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, జూన్ నెలలోనే నిధులు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.