Trade Talks: అమెరికా, భారత్ మధ్య సంబంధాలను ‘‘సుంకాలు’’ దెబ్బతీశాయి. ప్రపంచంలో, అత్యధికంగా భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ఇందుల్లో 25 శాతం పరస్పర సుంకాలు కాగా, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు మరో 25 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ టారిఫ్ టెన్షన్ మధ్య, సెప్టెంబర్ 22న వాణిజ్య చర్చల కోసం వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అమెరికా వెళ్తున్నారు. వాణిజ్య చర్చలకు కోసం అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.
Read Also: Hardik Pandya: అనవసర హైప్ వద్దు.. పాకిస్థాన్‌తో ఆడబోయేది మామూలు మ్యాచే!
పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా కుదిరే లక్ష్యంతో చర్చలు కొనసాగించడానికి ఈ ప్రతినిధి బృందం అమెరికాతో చర్చలు జరుపనుంది. పియూష్ గోయల్ తన పర్యటనలో న్యూయార్క్‌లో పర్యటిస్తారు. మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, ఇతర అధికారులు ఆయనతో ఉంటారు. H-1B వీసాల కోసం దరఖాస్తు రుసుమును USD 1,00,000కి పెంచాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
