Site icon NTV Telugu

Jharkhand: బైక్ రైడ్‌కు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై సామూహిక అత్యాచారం..

Physical Assault On Software Engineer

Physical Assault On Software Engineer

Physical assault on software engineer in jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన స్నేహితుడితో కలిసి మాట్లాడుతున్న సమయంలో ఓ యువతిని అపహరించి 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ కేసులో 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితులను పట్టుకునేందు పోలీసుదుల దాడులు నిర్వహిస్తున్నారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని 26 ఏళ్ల గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన అక్టోబర్ 20న చైబాసాప్రాంతంలో చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి, వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంటి నుంచే ఉద్యోగాన్ని చేస్తోంది. జింక్ సాని నివాసి అయిన యువతి చైబాసాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమర్హటులో అద్దె ఇంట్లో నివసిస్తోంది. రెండు రోజుల క్రితం తన స్నేహితుడితో కలిసి చైబాసా ఎయిర్ స్ట్రిప్ సందర్శించేందుకు వెళ్లింది. గురువారం సాయంత్రం స్కూటీ రైడ్ కోసం టెక్రాహటు ఎయిర్ స్ట్రిప్ కు చేరుకున్నారు. అయితే అక్కడ యువతి, తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. 10 మంది యువకులు వచ్చి ఇద్దరిని బెదిరించి దాడికి పాల్పడ్డారు. రూ.5000 వేలు, సెల్ ఫోన్లను తీసుకుని నిందితులు పరారయ్యారు.

Read Also: China: నేటితో ముగియనున్న కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్ పింగ్..!

అక్కడ నుంచి యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన యువతిన చైబాసా ఆస్పత్రిలో చేర్పించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో నిందితులు ఆమెను అక్కడే వదిలిపారిపోయారు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ విషయం గురువారం రాత్రి పోలీసులకు తెలియడంతో డీఎస్పీ దిలీప్ ఖల్కో, ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ పవన్ పాఠక్ ఘటన స్థలానికి చేరుకుని నిందితుల కోసం వేటను ప్రారంభించాయి. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులను అరెస్ట్ చేసి అందర్ని విచారిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు జార్ఖండ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం యువతిని సదర్ ఆస్పత్రిలో పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురిని విచారిస్తున్నామని ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు.

Exit mobile version