NTV Telugu Site icon

NIA: ఇస్లామిక్ పాలన స్థాపించాలన్నదే పీఎఫ్ఐ లక్ష్యం.. ఎన్ఐఏ ఛార్జిషీట్ లో వెల్లడి..

Pfi

Pfi

PFI wanted Islamic Rule by waging war against govt: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హింసాత్మక మార్గాల ద్వారా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఎన్ఐఏ ఈ కేసులో ఐదో ఛార్జీషీట్ లో 12 మంది పీఎఫ్ఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎన్ఈసీ) సభ్యులు, వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులతో సహా పీఎఫ్ఐకి చెందిన 19 వ్యక్తలపై అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో ఎన్ఐఏ అభియోగాలు మోపిన నిందితుల సంఖ్య 105కు చేరుకుంది. ఈ కేసులో రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉన్నారు.

Read Also: Rare Bird : తెలంగాణలో అరుదైన పక్షి.. ఎక్కడో తెలుస్తే షాక్ అవుతారు..?

గతేడాది పీఎఫ్ఐ సంస్థపై, ఆ సంస్థ కీలక సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఐఏ, ఈడీలు సంయుక్తంగా దాడులు చేశాయి. 2047 నాటికి భారత్ లో కాలిఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కుట్రతో పీఎఫ్ఐ క్యాడర్ కు ఆయుధాల శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. బయటకు జాతీయ సమైక్యత, మత సామరస్యం మరియు మైనారిటీలు మరియు బలహీన వర్గాల సంక్షేమం అనే సాకుతో పని చేయడం ద్వారా ఖలీపా సామ్రాజ్యాన్ని సమర్థించిందని దర్యాప్తులో తేలింది. ముస్లిం యుతను రాడికలైజ్ చేయడానికి పీఎఫ్ఐ పనిచేసింది. దేశానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు యువతను రెచ్చగొట్టడానికి విద్వేష కంటెంట్ ను సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించిందని ఎన్ఐఏ పేర్కొంది.

స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్(సిమి)పై నిషేధం తరువాత పీఎఫ్ఐ సంస్థ ఏర్పాటైంది. గతంలో సిమిలో పనిచేసిన అబూబకర్ అనే వ్యక్తి పీఎఫ్ఐ వ్యవస్థాపక చైర్మన్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే పీఎఫ్ఐలోని అనేక మంది సభ్యులు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో కూడా చేరారు. గతేడాది ఎన్ఐఏ నిర్వహించిన దాడుల్లో 450కి పైగా డిజిటల్ పరికరాలు మరియు 570 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత, జ్ఞానవాపి మసీదు విషయంలో విద్వేష పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Show comments