Site icon NTV Telugu

Uttarpradesh: పట్టపగలే డీజిల్ దొంగతనం.. అడ్డుకునేందుకు యత్నించిన మేనేజర్‌పై కాల్పులు

Petrol Bunk Manager Shot

Petrol Bunk Manager Shot

Uttarpradesh: డీజిల్ దొంగతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్ కాల్చి చంపబడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి-24పై ఆగి ఉన్న ట్రక్కు నుండి దొంగలు డీజిల్‌ను దొంగిలిస్తుండగా.. ఆపడానికి ప్రయత్నించిన పెట్రోల్ పంప్ మేనేజర్‌ ప్రయత్నించాడు. దీంతో తమ వద్ద ఉన్న గన్‌తో దొంగలు అతనిని పట్టపగలే కాల్చి చంపేశారు. మేనేజర్ సుశీల్ కుమార్, తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి తన పెట్రోల్ పంపు వద్ద ఉండగా కొంతమంది వ్యక్తులు ట్రక్కు నుండి డీజిల్ తీస్తుండగా గమనించాడు. అతను, అతని సహోద్యోగులు అభ్యంతరం చెప్పడంతో, దుండగులు అతనిని కాల్చి చంపి వారి కారులో పారిపోయారు.

Shocking Incident: చనిపోయాడు, అంత్యక్రియలు చేశారు.. కర్మకాండల రోజు తిరిగి వచ్చాడు..!

“ఒక పెట్రోల్ పంప్ మేనేజర్, అతని ఇద్దరు సహోద్యోగులతో కలిసి రోడ్డుపై ఉన్న పెట్రోల్ పంపు వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కు చుట్టూ అనుమానాస్పద కార్యకలాపాలు జరగడం గమనించారు. కొంతమంది తమ కారును పార్క్ చేసి ట్రక్ నుండి డీజిల్ దొంగిలిస్తుండగా.. వారు దొంగల వద్దకు వెళ్లి వారిని ఆపమని కోరినప్పుడు, వారు కాల్పులు జరిపారు, అందులో మేనేజర్ మరణించాడు,” అని రూరల్ బరేలీ ఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఓ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Exit mobile version