NTV Telugu Site icon

Petrol- Diesel Sales: జూలైలో తగ్గిన పెట్రోల్, డిజిల్ అమ్మకాలు.. పెరిగిన వంట గ్యాస్ వినియోగం

Petrol Diesel Sales

Petrol Diesel Sales

Petrol, Diesel Sales Fall In July: దేశంలో పెట్రోల్, డిజిల్ అమ్మకాలు జూలై నెలకు గానూ తగ్గిపోయాయి. సాధారణంగా రుతుపవనకాలంలో ప్రతీ సారి పెట్రోల్, డిజిల్ అమ్మకాలు తగ్గుతూ ఉంటాయి. ఈ సారి కూడా ఇదే విధంగా ఇంధన వినియోగం తగ్గింది. సాధారణంగా రుతుపవన కాలంలో వర్షాల కారణంగా ప్రజల ప్రయాణాలు తగ్గడంతో పాటు వ్యవసాయ రంగంలో పంప్ సెట్ల వాడకం తగ్గడం పెట్రోల్, డిజిల్ అమ్మకాలను ప్రభావితం చేస్తాయి. తాజాగా ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా ఉపయోగించే డిజిల్ వాడకం జూన్ తో పోలిస్తే జూలైలో తగ్గింది. జూన్ లో 7.39 మిలియన్ టన్నుల డిజిల్ వినియోగిస్తే.. జూలైలో 13.1 శాతం తగ్గి 6.44 మిలియన్ టన్నులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ప్రతీసారి ఏప్రిల్-జూన్ కన్నా జూలై-సెప్టెంబర్ లలో వినియోగం తగ్గడంతోనే పెట్రోల్, డిజిల్ అమ్మకాలు తగ్గతున్నాయి.

ఇదిలా ఉంటే 2022 జూలై నెలలో డిజిల్ డిమాండ్ గతేడాది 2021 జూలై కన్నా 17.1 శాతం ఎక్కువగా ఉంది. 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల డిజిల్ వినియోగం తగ్గింది. జూలై 2020లో డిజిల్ వినియోగం 4.84 మిలియన్ టన్నులు ఉంది. అంతే తాజాగా 2022 జూలై నెల అమ్మకాల 2020 జూలై కన్నా 32.4 శాతం అధికం. జూలై 2019లో కోవిడ్ కు ముందు 6.11 విలియన్ టన్నుల డిజిల్ అమ్మకాలు జరిగాయి. దీంతో పోల్చినా..2022 జూలై అమ్మకాలు 5 శాతం ఎక్కువే.

Read Also: Pakistan: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. పోలీస్ ముక్కు, చెవులు, పెదాలు కోసేసిన భర్త

ఇక జూన్ 2022తో పోలిస్తే జూలై 2022లో పెట్రోల్ అమ్మకాలు 5 శాతం పడిపోయాయి. జూన్ లో 2.8 మిలియన్ టన్నుల పెట్రోల్ అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది జూలైలో మాత్రం 2.66 మిలియన్ టన్నుల పెట్రోల్ అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఇక 2021 జూలైలో కన్నా 2022 జూలై మాసంలో పెట్రోల్ అమ్మకాలు 12.2 శాతం ఎక్కువ. 2020 జూలైతో పోలిస్తే 2022లో 31.2 శాతం అధికం. ఇక కోవిడ్ కన్నా ముందు అంటే 2019 జూలైతో పోలిస్తే 16.3 శాతం అధికం. సాధారణంగా వేసవిలో విద్యాలయాలకు సెలవులు ఉండటం.. ప్రజలు వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు హిల్ స్టేషన్లకు ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు.. దీంతో సహజంగానే జూన్ నెలలో పెట్రోల్, డిజిల్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

ఇక ఏవియేషన్ ఫ్యూయల్ డిమాండ్ 79 శాతానికి పెరిగింది. 5,33,600 టన్నులకు చేరుకుంది. ఇది జూలై 2020 కన్నా 137.4 శాతం ఎక్కువ కోవిడ్ తరువాత ప్రస్తుతం విమానరంగం కోలుకుంటోంది. దీంతో ఏవియేషన్ ఫ్యూయల్ వినియోగం కూడా పెరిగింది. అయితే ఇది కోవిడ్ ముందు సమయం 2019 జూలై కన్నా 14.1 శాతం తక్కువ. ఇక వంట గ్యాస్ ఎల్ పీజీ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.14 శాతం పెరిగింది. గ్యాస్ వినియోగం 2.46 మిలియన్ టన్నులకు చేరుకుంది. గ్యాస్ ధరలు పెరుగుతున్నా.. 2022 జూలై వినియోగం 2020 కన్నా 8.4 శాతం, 2019 జూలై కన్నా 11.9 శాతం ఎక్కువగా ఉంది. ఇక 2022 జూన్ తో పోలిస్తే..2022 జూలైలో ఎల్ పీ జీ వినియోగం 8.7 శాతం పెరిగి 2.26 మిలియన్ టన్నులకు చేరుకుంది.

Show comments