NTV Telugu Site icon

Petrol: పెట్రోలియం శాఖ కీలక ప్రకటన.. వాహనదారులకు శుభవార్త అందే ఛాన్స్‌!

Petrol

Petrol

వాహనదారులకు పెట్రోలియం శాఖ గుడ్‌న్యూస్ చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోవడం.. ఇంకోవైపు దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు పెట్రోలియం శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Sukumar- Dil Raju: నేనున్నా.. దిల్ రాజుకు సుక్కూ అభయం!

ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్‌ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Viral News: నన్ను చేసుకోబోయే వాడికి రూ.80 లక్షల ప్యాకేజీ ఇంకా.. విడాకులు తీసుకున్న 39 ఏళ్ల మహిళ పెద్ద లిస్ట్

ప్రస్తుతం దేశంలో హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిలక జరగబోతున్నాయి. అనంతరం కొద్దిరోజుల్లోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కచ్చితంగా తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా కేంద్రం రూ.2 తగ్గించింది. ఒక వైపు క్రూడాయిల్‌ ధరలు తగ్గడం.. ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ధరలు తగ్గితే వాహనదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: BJP VS INDIA: సీజేఐ ఇంటికి ప్రధాని మోడీ వెళ్లడంపై రాజకీయ దుమారం..