Site icon NTV Telugu

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్‌ను చూసి తల్లడిల్లిన పెంపుడు కుక్కలు.. వీడియో వైరల్

Singer Zubeen Garg3

Singer Zubeen Garg3

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. కమర్కుచి ఎన్‌సీ గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఇక కడసారి చూపు కోసం లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. ఇక జుబీన్ గార్గ్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కలను ఆయన భార్య గరిమ.. గౌహతిలతోని సరుసజై స్టేడియంలో ఉన్న శవపేటిక దగ్గరకు తీసుకెళ్లి చూపించారు. దీంతో పెంపుడు జంతువులు తల్లడిల్లిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

అంత్యక్రియలకు ప్రధాని మోడీ ప్రతినిధిగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు హాజరవుతున్నారు. అంత్యక్రియలకు లక్షల్లో జనాలు రానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. జోరాబత్ వరకు రహదారిని కొన్ని గంటల పాటు తాత్కాలికంగా మూసేశారు.

ఇక గార్గ్ అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం (సెప్టెంబర్ 23న) పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని అస్సాం ముఖ్యమంత్రి ప్రకటించారు. పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివస్తారన్న అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. స్మారక చిహ్నం కోసం గౌహతి సమీపంలోని సోనాపూర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

జుబీన్ గార్గ్ సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం (సెప్టెంబర్ 19) బోటుపై షికారు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. బోటులోంచి లైఫ్ జాకెట్ ధరించి నీళ్లల్లోకి దూకి ఈత కొట్టడం ప్రారంభించారు. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. కొద్దిసేపటికే ఆయన స్పృహ కోల్పోయారు. కొద్దిసేపు నీళ్లలోనే శవంలా ఉండిపోయారు. అనంతరం సహచరులు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఇది కూడా చదవండి: Lovers Drama: పోలీస్ వాహనంపై ప్రేమ జంట రచ్చరచ్చ.. వీడియో వైరల్

ఇక ఆయన మరణవార్త తెలియగానే అస్సామీయులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అంతేకాకుండా సింగపూర్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి భౌతికకాయం వచ్చింది. అక్కడ నుంచి గౌహతికి చేరుకుంది. గౌహతి నుంచి గార్గ్ నివాసానికి తీసుకెళ్లే క్రమంలో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి పూలవర్షం కురిపించారు. ఆయన్ను తలచుకుంటూ మహిళలు, పిల్లలు, వృద్ధులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: US: టారిఫ్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం.. జైశంకర్-మార్కో రూబియో భేటీ

జుబీన్ గార్గ్ 40 భాషల్లో పాడారు. 38,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అస్సాం సాంస్కృతిని పరిచయం చేశారు. ఇక గార్గ్ మృతి పట్ల అస్సాం ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.

 

Exit mobile version