Site icon NTV Telugu

ఒమిక్రాన్ ఎఫెక్ట్‌: అత్య‌ధిక‌మందిని వేధిస్తున్న స‌మ‌స్య‌లు ఇవే…

క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌ర్నీ వ‌ర‌ద‌ల‌డం లేదు. వ‌చ్చిన వారికే మ‌ళ్లీ మ‌ళ్లీ వ‌స్తున్న‌ది. ఇబ్బందుల‌కు గురిచేస్తున్న‌ది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయి. అయితే, ఒమిక్రాన్ కార‌ణంగా క‌రోనా బారిన ప‌డుతున్నా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగానే క‌నిపిస్తున్నాయి. జ్వ‌రం, త‌ల‌నొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, నీర‌సం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఈ వేరియంట్ గొంతుభాగంపై ప్ర‌భావం చూపుతున్న‌ది. ఊపిరితిత్తుల వ‌ర‌కు ఈ వేర‌యింట్ వ్యాపించ‌డం లేదు. కాబ‌ట్టి పెద్ద‌గా ప్ర‌మాద‌క‌రం కాద‌ని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. నాలుగైదు రోజులు వైద్యులు సూచించిన మెడిసిన్ వాడితే వేరియంట్ నుంచి కోలుకుకుంటున్నారు.

Read: ఈ రైడ్ యాప్స్ వాడుతున్నారా? మీ గుట్టు మొత్తం..!

కొంత‌మందిలో జ్వ‌రం, గొంతునొప్పి వంటి ల‌క్ష‌ణాలు త‌గ్గినా, నీర‌సంగా ఉండ‌టం, త‌ల‌నొప్పితో పాటు శ‌రీరంపై ద‌ద్దుర్లు వంటివి వ‌స్తున్నాయి. క‌రోనా నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ నాలుగైదు రోజుల‌పాటు ఈ ల‌క్ష‌ణాలు ఎక్కువ మందిలో క‌నిపిస్తుండ‌టంతో ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, క‌రోనా త‌రువాత ఇలాంటి ల‌క్ష‌ణాలు సాధ‌ర‌ణంగానే కొంత‌మందిలో క‌నిపిస్తాయ‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version