NTV Telugu Site icon

వారికి ఒక్క డోసు చాలు.. డెల్టా వేరియంట్‌ నుంచి కూడా రక్షణ..!

vaccine

vaccine

భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.. ఇప్పటికే 35.12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ పూర్తి చేసింది ప్రభుత్వం.. ఇదే సమయంలో వ్యాక్సిన్‌కు సంబంధించిన రకరాల ప్రయోగాలు సాగుతున్నాయి.. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్లు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఈ తరుణంలో.. కరోనా బారినపడి కోలుకున్న వారికి వ్యాక్సిన్‌ సింగిల్‌ డోసు ఇచ్చినా.. డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ లభిస్తున్నట్లు తేల్చింది భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌)… కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి లేదా రెండు డోసులు తీసుకున్నవారితో.. కరోనా నుంచి కోలుకుని, ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని పోల్చిచూస్తే డెల్టా వేరియంట్‌ నుంచి అత్యధిక రక్షణ పొందారని తేల్చింది ఐసీఎంఆర్‌ అధ్యయనం..