Site icon NTV Telugu

Food Poison: ఆశ్రమంలో భోజనం వికటించి ముగ్గురు మృతి.. మరో 15మందికి అస్వస్థత

Food Poison

Food Poison

Food Poison: రాజస్థాన్‌లోని కోటాలో గల అప్నా ఘర్ ఆశ్రమంలో కలుషిత ఆహారం కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో 15 మంది ఆసుపత్రి పాలైనట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఇవాళ ఉదయం కొందరు నిద్ర లేవకపోవడంతో, మరికొందరు వాంతులు చేసుకోగా వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

“ఆదివారం సాయంత్రం కొన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. సుమారు 15 మందిని ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారు. వైద్య బృందం అక్కడే ఉంది. అలాగే విచారణ కోసం ఆహారం, నీటి నమూనాలను సేకరిస్తున్నారు. బోర్‌వెల్ నీరే కారణమని భావిస్తున్నాం.” అని జిల్లా కలెక్టర్ ఓం ప్రకాష్ బంకర్ అన్నారు.

Trainee aircraft crash: వ్యవసాయ క్షేత్రంలో కూలిన ట్రైనీ విమానం.. పైలట్ సేఫ్

15 మంది ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య పరీక్షలు చేస్తున్నామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ భూపేందర్ సింగ్ తోమర్ వెల్లడించారు. వారికి పలు వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించామన్నారు. బోర్‌వెల్‌ నీటిని తాగిన వ్యక్తుల ఆరోగ్యమే తీవ్రంగా దెబ్బతిందని.. ఫుడ్ పాయిజనింగ్ నీటి ద్వారా సంక్రమించిందని తాము భావిస్తున్నాన్నట్లు ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version