Site icon NTV Telugu

బ్లాక్ ఫంగస్‌కు మందును కనిపెట్టిన ‘పతంజలి’

ఒమిక్రాన్ వేరియంట్ వంటి కరోనా వైరస్‌లతో పాటు ప‌లు ర‌కాల ఫంగ‌స్‌లు కూడా ప్రజలకు సోకుతున్నాయి. కాగా బ్లాక్ ఫంగ‌స్ (మ్యుకర్ మైకోసిస్) చికిత్స కోసం ప‌తంజ‌లి ఆయుర్వేద మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘అనూ తైల’ పేరుతో ముక్కు ద్వారా ఈ మందును ఇస్తార‌ని ప‌తంజ‌లి సంస్థ వెల్ల‌డించింది. అధునాతన సాంకేతిక పద్ధతులతో పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం ‘అనూ తైల’ మందును కనుగొందని వివ‌రించింది. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా ఇది ఓ ముందడుగు అని పతంజలి పేర్కొంది.

Read Also: కర్ణాటకలో మళ్లీ కలకలం రేపుతున్న మంకీ ఫీవర్.. తొలి కేసు నమోదు

ఈ నాసల్ డ్రాప్స్ యాంటీ ఫంగల్ ప్రభావాన్ని మైక్రోబయాలాజికల్, సైటోలాజికల్, అనలైటికల్ కెమికల్ పద్ధతిలో తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కరోనా సోకిన తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ పై మందు సమర్థంగా పనిచేసినట్టు తమ పరిశోధనల్లో తేలిందన్నారు. అనూతైల ఆయుర్వేద మందును ఎక్కువసార్లు అప్లై చేయడం వల్ల బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు లేకుండా పోయాయన్నారు. ప్రస్తుతం ఉన్న బ్లాక్ ఫంగస్ ఔషధం యాంఫోటెరిసిన్ బీతో పోలిస్తే అనూతైల బాగా పనిచేస్తున్నట్టు తేలిందన్నారు.

Exit mobile version