NTV Telugu Site icon

IndiGo: ఇండిగో విమానం 16 గంటలు ఆలస్యం..ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు..

Indigo

Indigo

IndiGo: ఇండిగో విమానం ఆలస్యం కావడంతో 100 మంది ప్రయాణికులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సాంకేతిక లోపం కారణంగా 16 గంటల ఆలస్యం కావడంతో ఇస్తాంబుల్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికులకు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.

Read Also: Rahul Gandhi: మన్మోహన్ సింగ్‌ని బీజేపీ అవమానించింది.

ఇస్తాంబుల్‌‌కి ఉదయం 6.55 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ 6E17 ఇప్పుడు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ‘‘మా ఫ్లైట్ 6E17, వాస్తవానికి ముంబై నుండి ఇస్తాంబుల్‌కి నడపాల్సి ఉంది, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైనందుకు మేము చింతిస్తున్నాము. దురదృష్టవశాత్తు, సమస్యను సరిదిద్దడానికి, గమ్యస్థానానికి పంపించడానికి మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, చివరికి మేము విమానాన్ని రద్దు చేయవలసి వచ్చింది’’ అని ఇండిగో చెప్పింది. ప్రత్యామ్నాయ విమానాన్ని రాత్రి 11 గంటలకు ఏర్పాటు చేసినట్లు చెప్పింది.

చాలా మంది ప్రయాణికులు ఈ ఆలస్యం వల్ల ప్రభావితమయ్యారు. ఇండిగోకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రీఫండ్, ఆల్టర్‌నేట్ విమానం ఏర్పాటు చేయాలని కోరారు. కొందరు సోషల్ మీడియాలో ఇండిగోని నిందించారు. సిబ్బంది మొరటుగా ప్రవర్తించారని, రీషెడ్యూల్, రీఫండ్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆరోపించారు. సచిన్ చింతల్వాడ్ అనే యూజర్.. ఈ ఆలస్యం కారణంగా ఇస్తాంబుల్ నుంచి వాషింగ్టన్‌కి వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌ని మిస్సయ్యే అవకాశం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Show comments