రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. నేడు పార్లమెంట్ భవనంలో మూడు సమావేశాలు జరగనుండగా.. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో నేడు 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. సమావేశానికి ఉభయ సభలకు చెందిన అన్ని పక్షాల నాయకులు హాజరు కానున్నారు. వర్షాకాల సమావేశాలలో చర్చకు తీసుకురావాల్సిన అంశాలపై అన్ని పక్షాల నాయకులు పలు సూచనలు చేయనున్నాయి. అర్థవంతంగా, సజావుగా పార్లమెంట్ సమావేశాలు సాగేందుకు అన్ని పక్షాల సహకారం ప్రభుత్వం కోరనుంది. ఇక ఇవాళ కాంగ్రెస్ ఎంపీలతో అధినేత్రి సోనియాగాంధీ సమావేశమవనున్నారు. వర్చువల్‌గా నిర్వహించే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
