Site icon NTV Telugu

కాశ్మీర్ లో స్టాండింగ్ కమిటీ సమావేశాలు…

gvl-narasimha-rao

gvl-narasimha-rao

బీజేపీ రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ… కాశ్మీర్ లో ఇప్పటివరకు 18 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. జమ్మూ-కాశ్మీర్ పునర్విభజన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం గా మారిపోయున జమ్మూ-కాశ్మీర్ లో ప్రజల మనోభావాలను స్వయంగా తెలుసుకోవాలనే ఉత్సుకతే ఈ పరిణామానికి ప్రధాన కారణం. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు పార్లమెంట్ సభ్యులు దీనిని ఒక అవకాశం గా తీసుకుంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియగానే, వరుసగా ఇప్పటివరకు 18 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు కాశ్మీర్ లో జరిగాయి. గతంలో తీవ్రవాదం, హింస, రక్షణ ఉండదనే భయం కాశ్మీర్ వెళ్ళేందుకు సంకోచం ఉండేది.

అయితే పునర్విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్ క్రమాలు వేగంగా జరుగుతున్నాయనే భావన ప్రజల్లో చాలా బలంగా ఉంది. భూతల స్వర్గంగా పిలవబడే కాశ్మీర్ లో పర్యాటకుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. జమ్మూ కాశ్మీరు లో ప్రధాన జీవనాధారమైన పర్యాటక రంగానికి పెద్ద ఊతం వచ్చినట్లుగా ఉంది. రానున్న రోజులలో జమ్మూ కాశ్మీరు మరింత అభివృధ్ది జరుగుతుందన్న అభిప్రాయం ప్రజలలో చాలా బలంగా ఉంది .

Exit mobile version