NTV Telugu Site icon

Parliament’s Winter Session: నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

Parliament's Winter Session

Parliament's Winter Session

Parliament’s Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమయంలో పార్లమెంట్ ఉభయసభలు (లోక్‌సభ మరియు రాజ్యసభ) సమావేశపరచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ధృవీకరించారు.

Read Also: RK Roja: మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

భారతరాజ్యాంగాన్ని ఆమోదించి 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతోంది ఈ శీతాకాల సమావేశాల్లో ప్రధానంశం. న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు ఎంపీలంతా హాజరవుతారు. వక్ఫ్ బిల్లుతో పాటు, ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ వంటి బిల్లుల్ని ఈ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఇప్పటికే వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ(జేపీసీ) చర్చిస్తోంది.

Show comments