Site icon NTV Telugu

Parliament Monsoon Session 2022: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Parliament Monsoon Session 2022

Parliament Monsoon Session 2022

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియతో రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 18 నుంచి ఆగష్టు 12 వరకు ఈ సెషన్ కొనసాగనుంది. అయితే.. మొత్తం 26 రోజుల వ్యవధిలో దాదాపు 18 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి. దాదాపు 24 కీలక బిల్లులను కేంద్రం సభల ముందుకు తీసుకురానుంది. లో క్ సభలో పెండింగ్​లో ఉన్న ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు 2022, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ బిల్లు 2019, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ డెలివరీ సిస్టం సవరణ బిల్లు 2022 లోక్ సభలో పాసై రాజ్య సభ ముందుకు రానున్నాయి. కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు–2022, ది ఫ్యామిలీ కోర్ట్స్(సవరణ) బిల్లు–2022 తోపాటు కొన్ని కీలక బిల్లులను కేంద్రం సభలలో ప్రవేశపెట్టనుంది. కాగా మహారాష్ట్ర, గోవాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్, ఇంధన ధరల పెంపు, నిత్యవసర ధరలు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక‌ మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంది.

read also: India Vs England: నేడు మూడో వన్డే.. గెలిచిన జట్టుకే సిరీస్

రేప‌ట్నుంచి మొద‌లు కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీల సభ్యులను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఈనేప‌థ్యంలో.. పార్లమెంట్ హాల్​లో శనివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన విష‌యం తెలిసిందే.. జీరో అవర్​లో అంశాలను లేవనెత్తేందుకు నోటీసు సమర్పణ సమయంలో మార్పు చేసినట్లు వెల్లడించారు. కాగా.. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చించాలని నేతల్ని కోరారు. అయితే నేడు (ఆదివారం) రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు రాజ్య సభ ఫ్లోర్ లీడర్లతో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు.

Europe: యూరప్ లో కార్చిచ్చు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Exit mobile version