Site icon NTV Telugu

Jagdeep Dhankhar: “పార్లమెంట్ అత్యున్నతమైంది”.. న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో..న్కాయ వ్యవస్థపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌తో పాటు నిషికాంత్ దూబే వంటి పలువురు బీజేపీ నేతలు సుప్రీంకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, మరోసారి జగదీప్ ధంఖర్ న్యాయవ్యవస్థ అతిగా స్పందించడాన్ని విమర్శించారు.

Read Also: Kamal Haasan: త్రిష తో బనానా జోక్.. ఈ వయసులో అవసరమా?

ఎన్నికైన ప్రతినిధులు రాజ్యాంగంలో అంతిమ మాస్టర్లు అని చెప్పారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్ అత్యున్నతమైంది’’ అని పునరుద్ఘాటించారు. ‘‘ రాజ్యాంగం ప్రజల కోసం అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అల్టిమేట్ మాస్టర్లు. పార్లమెంట్ కన్నా మించిన ఏ అధికారాన్ని రాజ్యాంగం ఇవ్వలేదు. పార్లమెంట్ అత్యున్నతమైంది. దేశంలో ప్రతీ వ్యక్తిలాగే ఇది కూడా అత్యున్నతమైంది.’’ అని అన్నారు.

సుప్రీంకోర్టు రెండు సార్లు విరుద్ధమైన తీర్పులను కూడా ఉప రాష్ట్రపతి ప్రస్తావించారు. ఒక సందర్భంలో పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని గోరఖ్ నాథ్ కేసులో, మరొక సందర్భంలో అది రాజ్యాంగంలో భాగమని కేశావానంద్ భారతీ కేసులో సుప్రీంకోర్టు చెబుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

Exit mobile version