Site icon NTV Telugu

Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి నిర్మలమ్మ బడ్జెట్ ఎప్పుడంటే..!

Parliament Budget Sessions

Parliament Budget Sessions

2026 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది. జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించనున్నారు. ఇక ఫిబ్రవరి 1న (ఆదివారం) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలమ్మ గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1 (ఆదివారం) వచ్చింది. అయితే ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడతారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. మొత్తానికి ఆదివారమే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Maria Machado: అధికారం కోసం ట్రంప్‌తో ఎలాంటి చర్చలు జరపలేదు.. మచాడో ప్రకటన

ఇక 2026 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రూ.11 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నిర్మలమ్మ బడ్జెట్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యంలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఆ దిశగా కూడా బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. రాబోయే బడ్జెట్‌లో తగిన వనరులను కేటాయించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇక రాబోయే బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వం విత్తన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు వన్ నేషన్-వన్ ఎలక్షన్, 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లు ప్రవేశపెట్టే ఛాన్సుంది.

Exit mobile version