Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
- భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్
- గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
- ఫేక్ న్యూస్ అంటూ కామెంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పప్పు యాదవ్.. స్వతంత్ర ఎంపీ. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. కాంగ్రెస్‌తో కలిసి తిరుగుతుంటారు. అయితే పప్పు యాదవ్ గురించి ఇప్పుడెందుకు అంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
పప్పు యాదవ్.. ఎంత పెద్ద భారీకాయమో చూసినోళ్లందరికీ తెలిసిందే. సరిగ్గా నడవడం కూడా చేతకాని స్థితిలో భారీ స్థూలకాయం కలిగి ఉంటారు. అలాంటిది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. భారీకాయం నుంచి స్లిమ్‌గా మారిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియో చూస్తే.. ఎవరికైనా డౌట్ వస్తుంది. పప్పు యాదవేనా? లేదంటే ఇంకెవరైనానా అన్న అనుమానం కలుగుతుంది. అంతగా సన్నబడ్డారు. వీడియో చూసినవాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు. ఇంతగా ఎలా సన్నబడ్డారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
శనివారం సీజేపీ కార్యకర్త నిషు ఆజాద్‌కు సంబంధించిన కేసుపై పప్పు యాదవ్ మీడియాతో మాట్లాడారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల కంటే.. ఆయనలో కనిపించిన భారీ బరువు తగ్గుదలే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. శారీరక మార్పుపై సోషల్ మీడియాలో పలువురు చర్చించుకుంటున్నారు. ఆయనను గుర్తుపట్టలేకపోయామని కొందరు యూజర్లు పేర్కొన్నారు. ఇంకొందరు ఇందులో పప్పు యాదవ్ ఎక్కడున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.
అయితే పప్పు యాదవ్ బరువు తగ్గడానికి కారణం ఏమిటన్న దానిపై ఆయన నుంచి గానీ, ఆయన కార్యాలయం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ మార్పుపై పప్పు యాదవ్ స్వయంగా స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
#WATCH | Patna, Bihar: On the case related to CJP activist Nishu Azad, Independent MP Pappu Yadav says, “Now, as long as Rahul Gandhi is not sitting at the police station for a protest, the daughter will never get justice. Today, we had to sit at the police station for three… pic.twitter.com/jUUJkBFXFw
— ANI (@ANI) September 4, 2026
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!