NTV Telugu Site icon

Panchkula VIRAL VIDEO: భార్యను బేస్‌బాల్ బ్యాట్‌తో చితక్కొట్టిన భర్త.. సపోర్టు చేస్తూ నెటిజన్‌ల కామెంట్స్..

Panchakula

Panchakula

Panchkula VIRAL VIDEO: హర్యానా పంచకులలో ఓ భర్త తన భార్యను బేస్ బాల్ బ్యాట్ పట్టుకుని చితకబాదాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంచకులలోని సెక్టార్ 26లోని పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త భార్యను బేస్ బాల్ బ్యాట్‌తో కొడుతున్న వీడియోను ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. తన భార్య వేరే వ్యక్తిలో కారులో కలిసి ఉన్నట్టు గుర్తించి భర్త ఆ మహిళపై దాడి చేయడం చూడవచ్చు. తన భార్య వేరు వ్యక్తితో కలిసి కారులో ఉండటాన్ని గమనించిన సదరు వ్యక్తి కారు డోర్లను పగలగొట్టారు.

Read Also: Opinion Polls: బీజేపీ కూటమి ఈ సారి 400 సీట్లు సాధిస్తుందా..? వివిధ సంస్థల ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పాయి..

తనను కొట్టవద్దని భార్య వేడుకున్నా భర్త ఆవేశం చల్లారలేదు. కారులో కూర్చున్న వ్యక్తి ఈ ఘటనను చూసి షాక్ అయ్యాడు. భార్యపై కోపంతో ఉన్న సమయంలో కారులోని సదరు వ్యక్తి బయటకు వచ్చినప్పటికీ, ధైర్యం చేసి మహిళ భర్త దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించారు. తన భార్య అకారణంగా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తుందని అతను ఆరోపించాడు. ఈ దాడిని రికార్డ్ చేయాలని భార్య వేడుకోవడం వీడియోలో చూడవచ్చు. అక్కడే పార్కులో ఉన్న కొంతమంది వ్యక్తలు కలుగజేసుకుని భార్యపై దాడిని ఆపారు. ఈ ఘటనపై సెక్టార్-25లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు భర్తపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఈ సంఘటనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అయితే, చాలా మంది మాత్రం భర్త చేసిన పనికి సపోర్టు చేస్తూ కామెంట్స్ చేశారు. ఒక స్త్రీ తన భర్తతో నిజాయితీగా జీవిస్తానని ప్రమాణం చేసి, వేరే పురుషుడితో పట్టుబడితే ఎందుకు అనుమానించకూడదు..? అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు కామెంట్ చేస్తూ, ఒక మహిళపై దాడి చేయడాన్ని ఎలా సమర్ధిస్తారు అని ప్రశ్నించారు. మగవారు డ్యాన్సర్ బార్, మసాజ్ సెంటర్లకు వెళితే పర్వాలేదు, కానీ భార్య వేరే వ్యక్తితో కూర్చుంటే అది వ్యభిచారమా.. ప్రజల ఆలోచన విధానం మారాలని మరొకరు కామెంట్ చేశారు.