Smriti Mandhana: మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కు మంధాన ఫుల్ స్టాప్ పెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి రద్దు అయిన విషయాన్ని ప్రకటించింది. పెళ్లి రద్దు గురించి ప్రకటించిన కొంతసేపటికే.. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. నవంబర్ 23న ఈ జంటకు వివాహం జరగాల్సి ఉంది. అయితే, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానాకి గుండెపోటు రావడం, పలాష్ కూడా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేయడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
తాజాగా, స్మృతి తన పెళ్లి రద్దును ప్రకటించిన తర్వాత ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం చూస్తే, వీరిద్దరు శాశ్వతంగా విడిపోయినట్లు తెలుస్తోంది. పలాష్ ఆస్పత్రిలో చేరడం, పెళ్లి ఆగిపోయిన తర్వాత అనేక ఊహాగానాలు చుట్టుముట్టాయి. పలాష్ వేరే అమ్మాయితో కలిసి స్మృతిని మోసం చేసినట్లు ఆన్‌లైన్‌లో పెద్ద చర్చ నడిచింది.
Read Also: Forex Reserve: వరుసగా రెండవ వారం పడిపోయాయిన భారత విదేశీ మారక నిల్వలు.. పెరిగిన బంగారం నిల్వలు
ఆదివారం పలాష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘‘నేనే నా జీవితంతో ముందుకు సాగాలని, వ్యక్తిగత సంబంధం నుంచి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు ఆధారాలు లేకుండా నను నిందించడం కష్టంగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ. నా నమ్మకాలు, గౌరవంతో దీనిని ఎదుర్కొంటా’’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
దీనికి ముందు స్మృతి కూడా ఇన్‌స్టాలో తన మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ‘‘నేను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నాను. మీరంతా కూడా అదే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలి, అలాగే మేము ఈ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగడానికి కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నాను. తన దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంటుంది. మనందరినీ నడిపించే ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉందని నేను నమ్ముతాను, నా విషయంలో అది ఎల్లప్పుడూ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమే. వీలైనంత కాలం భారతదేశం కోసం ఆడాలని, ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇక ముందుకు సాగే సమయం ఆసన్నమైంది’’ అంటూ పోస్ట్ పెట్టింది.
