Site icon NTV Telugu

Jyoti Malhotra: “భారత్ ఏజెంట్ల”ను గుర్తించేందుకు పాకిస్తాన్‌కి సాయం చేసిన జ్యోతి మల్హోత్రా.!

Jyoti Malhotra

Jyoti Malhotra

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన ఆమెను, ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సంయుక్తంగా విచారిస్తున్నాయి. ప్రస్తుతం జ్యోతి ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉంది. ఈ కేసులో ఇప్పటికే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడితో ఈమెకు సంబంధం ఉండా..? అనేది కూడా విచారిస్తున్నారు. జ్యోతి కాశ్మీర్ పర్యటన తర్వాత పాకిస్తాన్ వెళ్లడం సంచలనంగా మారింది. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరున్న జ్యోతి ఇప్పటికి మూడు సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చింది. పాక్ రాయబార కార్యాలయం ఉద్యోగి డానిష్‌తో ఈమెకు సంబంధం ఉన్నట్లు తేలింది.

Read Also: Addanki Dayakar: విచారణ కమిషన్ శీలాన్ని శంకించవలసిన పనిలేదు.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు..!

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), భారత రహస్య ఏజెంట్లను గుర్తించడానికి జ్యోతి మల్హోత్రాను ఉపయోగించుకున్నట్లు సమాచారం. మల్హోత్రా మరియు ISI హ్యాండ్లర్ అలీ హసన్ మధ్య వాట్సాప్ చాట్‌లు బయటపడ్డాయని, భారతదేశ రహస్య కార్యకలాపాలకు సంబంధించిన కోడెడ్ మెసేజ్‌లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక మేసేజ్‌లో, అట్టారీ బోర్డర్‌లో ఉన్నప్పుడు ఎవరైనా అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించారా..? వారు స్పెషల్ ప్రోటోకాల్ అందుకున్నారా..? అని హసన్, జ్యోతిని అడినట్లు తెలిసింది. “ప్రోటోకాల్”, “అండర్ కవర్ ఏజెంట్” వంటి పదాల బట్టి చూస్తే భారత ఏజెంట్ల నున గుర్తించడానికి నిఘా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రోటోకాల్ ఎవరికి వస్తుందనేది తెలిస్తే అండర్ కవర్ ఏజెంట్లు ఎవరనేది గుర్తించవచ్చని హసన్ జ్యోతితో చెప్పాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, హసన్ ప్రశ్నకి సమాధానంగా జ్యోతి తాను ఎవరిని చూడలేదని, ‘‘వారు అంత తెలివితక్కువవారు కాదు’’ అని బదులిచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం పరిణామాలను చూస్తే, జ్యోతి భారత ఏజెంట్ల వివరాలను ఐఎస్ఐకి ఉద్దేశపూర్వకంగా లీక్ చేయాలని చూసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Exit mobile version